*బాల్కొండలో కొత్తగా మంజూరైన పెంచిన్ లను పంపిణీ చేసిన మంత్రి ప్రశాంత్ రెడ్డి*
బాల్కొండ ఆగస్టు 30 (జనం సాక్షి ) బాల్కొండ మండల కేంద్రంలోని MK గార్డెన్ ఫంక్షన్ హాల్లో మంగళవారం నూతనంగా మంజూరైన పెంచిన్ ప్రొసీడింగ్ కాపీలను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో 57 ఏండ్లు నిండిన వృద్ధులకు మరియు వికలాంగులకు,వితంతువుల పెంచిన్ లు పంపిణీ చేయడం ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు.బాల్కొండ మండలానికి 1154 కొత్తగా పెంచిన్లు మంజూరు అయ్యాయని తెలిపారు.పేద కుటుంబాలకు ఆసరాగా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈఆసరా పథకాన్ని ప్రవేశ పెట్టారని ఆయన అన్నారు.పేదల మొఖంలో చిరునవ్వు చూడడమే కేసీఆర్ లక్ష్యమని అన్నారు.మంత్రితో పాటు నిజామాబాద్ ఏసిపి నాగరాజు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.లబ్ధిదారులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మంత్రి ప్రశాంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు.*
*ఈకార్యక్రమంలో ఎంపీపీ లావణ్య-లింగాగౌడ్,జడ్పీటీసీ దాసరి లావణ్య-వెంకటేష్,RDO శ్రీనివాసులు,DLPO శ్రీనివాస్,ఎంపీడీఓ సంతోష్ కుమార్,స్థానిక సర్పంచి భూస సునీత-నరహరి,సర్పంచ్లు,ఎంపీటీసీ లు,తెరాస మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి,సొసైటీ చైర్మన్ నాగులపల్లి సూరజ్ రెడ్డి,మండల కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ ఫయాజ్ అలీ,ఉపసర్పంచి షేక్ వాహబ్,నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు తౌటు గంగాధర్,తెరాస మండల ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యా సాగర్,గ్రామ శాఖ అధ్యక్షుడు సాగర్ యాదవ్,రైతుబంధు మండల కో ఆర్డినేటర్ నాగులపల్లి రాజేశ్వర్,రైతు బంధు జిల్లా సభ్యులు ఆకుల నరేందర్,అధికారులు,ప్రజాప్రతిని ధులు,నాయకులు,తదితరులు పాల్గొన్నారు*