*బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలి*,

*ఏఐటీయూసీ  జిల్లా కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి
నల్గొండ బ్యూరో. జనం సాక్షి
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రభుత్వం ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని *ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి  పల్లా దేవేందర్ రెడ్డి* పిలుపునిచ్చారు . గురువారం చండూరులోని ఎండిఓ కార్యాలయంలో  ఏఐటీయూసీ ,ఇలొవే   ఆధ్వర్యంలో జరిగిన పత్తి కార్మికుల మండల  అవగాహన సదస్సు లో దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిన ఇంకా పది కోట్ల మంది బాల కార్మికులు ఉండడం విచారకరమని  ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఇలొవే  సహకారంతో ఏఐటీయూసీ  ఆధ్వర్యంలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం జిల్లాలలో ప్రజలను విద్యార్థులను చైతన్య పరుస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే పత్తి కార్మికులకు సామాజిక న్యాయం, కనీస వేతనాలు వారి జీవన స్థితిగతులను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని అన్నారు. పనిచేసే ప్రదేశాల్లో మహిళలకు సామాజిక భద్రత రక్షణ కల్పించాలని కోరారు. స్త్రీ పురుషుల మధ్య వేతనాల్లో వ్యత్యాసం లేకుండా చూడాలని, కనీస వేతనాలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. పేద మధ్యతరగతి ప్రజల జీవన విధానం మెరుగుపరచకుండా ,వారి ఆర్థిక అవసరాలను తీర్చకుండా బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన సాధ్యం కాదు అని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు భద్రత కల్పించాలని కోరారు. చిన్న సన్నకారు రైతులు ప్రయోజనాలను  కాపాడడం కోసం రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, మార్కెట్ వసతి  ఏర్పాటు చేయాలని కోరారు. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం మెరుగైన జీవన విధానం కోసం  ఇలొవే  (ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ )కృషి చేస్తుందని  అన్నారు. ఈశ్వర సుకు ఈ ఏఐటీయూసీ  జిల్లా అధ్యక్షులు నలపరాజు సతీష్ కుమార్ అధ్యక్షత వహించగా మండల పరిషత్ ఉపాధ్యక్షులు మందడి నరసింహారెడ్డి. ఎక్స్ ఎంపీపీ తోకల వెంకన్న,రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు కోడి వెంకన్న, అగ్రికల్చర్ మండల అధికారి పి.మల్లేష్, ఏ పి వో.ఎన్ .శ్రీనివాస్,

ఏఐటియుసి మండల అధ్యక్షులు దోటి వెంకన్న,కొండాపురం సర్పంచ్ బరిగల యాదమ్మ, జెల్లా శ్రీను, ఏ ఐ ఎస్ ఎఫ్ రాష్ట్ర  ఉపాధ్యక్షులు బరిగల వెంకటేష్,బొడ్డు వెంకన్న, కర్నాటి వెంకటేష్,పల్లే శంకర్,జగన్,జావేద్,రవి,శ్రీను,యాదయ్య,
 తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు