*బాల బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి. *సిడిపిఓ అవంతిక.

చిట్యాల సెప్టెంబర్ 20(జనం సాక్షి) బాలబాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సిడిపిఓ అవంతిక అన్నారు.  గురువారం మండలంలోని బావుసింగ్ పల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ దామెరబోయిన నారాయణరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా సిడిపిఓ అవంతిక పాల్గొని బాల బాలికల నూతన సంరక్షణ కమిటీ ఏర్పాటు చేశారు .అనంతరం సిడిపిఓ అవంతిక ,సర్పంచ్ దామెరబోయిన నారాయణరావు మాట్లాడుతూ జీరో నుండి 18 సంవత్సరాల లోపు బాల బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చేందుకు ప్రతి మూడు నెలలకోసారి కమిటీ సమావేశంలో సమస్యలు పరిష్కరించాలని అన్నారు. గర్భవతులు పౌష్టికాహారం తీసుకోవాలని, ఆరోగ్య సూత్రాలను పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ జయప్రద, ఉపాధ్యాయులు రఫీ, అంగన్వాడీ టీచర్స్ రజిత, శ్రీలత, ఆశా వర్కర్ సుజాత, పిల్లల తల్లిదండ్రులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.