బావిలో పడి చిన్నారి మృతి

వరంగల్‌,మే9(జ‌నం సాక్షి):  కమలాపూర్‌ మండలం ఉప్పల్‌లో విషాద వాతావరణం నెలకొంది. ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారి.. ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. దీంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. విషయం తెలుసుకుని రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. బాలిక తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈ ఘటన గ్రామంలో విసాదం నింపింది.