Wednesday, 4 November 2026

బావిలో పడి మహిళా ఆత్మహత్య

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్. అనారోగ్య కారణాలతో మహిళ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన
నేరేడుచర్ల పట్టణంలో చోటు చేసుకుంది.స్థానిక ఎస్సై నవీన్ కుమార్ తెలిపిన వివరాలు ప్రకారం నేరేడుచర్ల పట్టణానికి చెందిన
అవిరెడ్డి నాగమ్మ (63) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. కట్టుకున్న భర్త కన్న వారు సైతం దూరమవడంతో
వృద్ధాప్యంలో చూసేవారు లేరని మన స్థాపనతో మంగళవారం
రామాపురం దగ్గరలో గల వ్యవసాయ బావిలో ఆత్మహత్య చేసుకుంది.కంపల్లి నారాయణరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్నిహుజూర్నగర్ ఏరియా హాస్పిటల్ కు తరలించినట్లు ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు.