బింబిసార అంచనాలు పెంచిన ట్రైలర్‌

నందమూరీ కళ్యాణ్‌ రామ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ’బింబిసార’ సోషీయో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ చిత్రానికి వశిష్ఠ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఇటీవలే విడుదలైన ట్రైలర్‌ అంచనాలను రెట్టింపు చేసింది. అంతేకాకుండా టైర్‌2 హీరోలలో మోస్ట్‌ వ్యూవుడ్‌ ట్రైలర్‌లలో బింబిసారా రెండవ ప్లేస్‌ను దక్కించుకుంది. ఈ చిత్రం ఆగస్టు 5న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం వరుస
అప్‌డేట్‌లను ఇస్తుంది. తాజాగా ఈ చిత్రంలోని ఈశ్వరుడే సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ’ఈశ్వరుడే చేసినాడు కొత్త గారడే’ అంటూ సాగే ఈ పాటను కాలభైరవ ఆలపించాడు. శ్రీమణి సాహిత్యం అందించాడు. చైతన్‌ భరద్వాజ్‌ స్వరపరిచిన ఈ పాట గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది. ఈ చిత్రంలో కళ్యాణ్‌ రామ్‌ రెండు విభిన్న కోణాల్లో సాగే పాత్రలో కనిపించనున్నాడు. ఒకటి రాజు పాత్ర కాగా, మరోకటి సామాన్యుడి పాత్ర. ఎన్‌టీఆర్‌ అర్ట్స్‌ బ్యానర్‌పై కళ్యాణ్‌రామ్‌ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కేథరిన్‌ ట్రెసా, సంయుక్త విూనన్‌, వారినా హుస్సేన్‌లు కథానాయికలుగా నటించనున్నారు.