పీప్‌షో హీరోగా ఆటో రాంప్రసాద్‌

జబర్దస్త్‌ ఫేమ్‌ ఆటో రాంప్రసాద్‌ తొలిసారి హీరోగా నటిస్చున్న చిత్రం పీప్‌ షో. సుప్రీమ్‌ డ్రీమ్స్‌ పతాకంపై యువ ప్రతిభాశాలి క్రాంతికుమార్‌ సి.హెచ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నేహాదేశ్‌ పాండే హీరోయిన్‌ గా నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ షూటింగ్‌ పూర్తి చేసుకొని పోస్ట్‌ ప్రొడక్షన్‌ జరుపుకుంటోంది. ఈ తరుణంలోనే ఈ క్రేజీ చిత్రం టీజర్‌ ను చిత్ర నిర్వాహకులు రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా హీరో రామ్‌ప్రసాద్‌ మాట్లాడుతూ.. ’పీప్‌ షో’ చిత్రం దర్శకుడిగా తన మిత్రుడు క్రాంతి దర్శకత్వ ప్రతిభకు అద్దం పడుతుందన్నారు. జబర్దస్త్‌ సూపర్‌ స్టార్స్‌ లో ఒకడైన ఆటో రామ్‌ ప్రసాద్‌ తొలిసారి హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి మలయాళ సంగీత సంచలనం రంజిన్‌ రాజ్‌ మ్యూజిక్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనే మూవీ మేకర్స్‌ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. దొంగచాటుగా తొంగిచూడడాన్ని ’పీప్‌ షో’ అంటారు.