బిఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ తో సమావేశం…
వరంగల్ ఈస్ట్, జులై 21 (జనం సాక్షి)
ఓసిటీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరంగల్ తూర్పు నియోజకవర్గ బిఆర్ఎస్ సోషల్ మీడియా ముఖ్యులతో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సమావేశం నిర్వహించారు
రానున్న ఎన్నికల్లో చురుగ్గా పనిచేస్తూ,బీజేపీ కాంగ్రెస్ చేస్తున్న దుష్ర్పచారాలను తిప్పికొట్టాలని,సంక్షేమ పథకాలు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయాలని ఎమ్మెల్యే కోరారు
వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని 3800 కోట్లతో బ్రహ్మాండంగా అభివృద్ధి చేశామని అటు విద్య ఇటు వైద్యంలో టాప్ లో ఉన్నామని
గత పాలకులు ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా వెనుకబడేశారనేది వివరిస్తూ
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎమ్మెల్యేగా తాను ఈ నియోజకవర్గాన్ని ఎంత గొప్పగా అభివృద్ధి చేశాము అనేది సోషల్ మీడియా కార్యకర్తలకు ఎమ్మెల్యే క్లుప్తంగా వివరించారు
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మంత్రి కేటీఆర్ మార్గనిర్దేశంలో ఈ నియోజకవర్గాన్ని కనివిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేశామని మనం చేసిన పని చెప్పుకుంటు ప్రతిపక్షాలు లేనిపోని విమర్శలని తిప్పికొట్టాలని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వారియర్స్ కు దిశానిర్దేశం చేశారు కష్టపడితే కచ్చితంగా గుర్తింపు ఉంటుందని సోషల్ మీడియా వారియస్స్ కు ఎమ్మెల్యే నన్నపునేని భరోసానిచ్చారు…