బిఎంఎస్ ఆధ్వర్యంలో ఘనంగా విశ్వకర్మ జయంతి

బాన్సువాడ, సెప్టెంబర్17(జనంసాక్షి):
బాన్సువాడ ఆర్టీసీ డిపోలో బిఎమ్ఎస్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శనివారం విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో కార్యదర్శి రవీందర్ గౌడ్ మాట్లాడుతూ విశ్వకర్మ జీవన విధానంపై ఎంతో గొప్పదని
ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్యారేజ్ కార్య దర్శి శివకుమార్, జావిద్ పాషా, వెంకటేష్, గోపికృష్ణ గౌడ్, పెంటగౌడ్, వినోద్ చారి, సునంద, పరమాత్మ, లింగురాం, శ్రీనివాస్, గంగాధర్ , కృష్ణమోహన్, ఆర్ఎస్ఎస్ పెద్దలు రాములు, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.