బిక్షాటన చేసిన విఆర్ ఏ లు
30 రోజులైనా స్పందించని ప్రభుత్వం
దంతాలపల్లి ఆగస్టు 23 జనం సాక్షి
గత 30 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుండి ఖమ్మం వరంగల్ జాతీయ రహదారిపై వీఆర్ఏలు బిక్షాటన చేస్తూ ప్రభుత్వం ప్రకటించిన పే స్కేల్ను వెంటనే అమలు చేయాలని వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు పులుగుజ్జ మధుసూదన్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అర్హత కలిగిన వీఆర్ఏలకు పదోన్నతులు కల్పించాలని 55 సంవత్సరాలు నిండిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి తోట వెంకన్న వీఆర్ఏలు ప్రసన్న, రవి, రేణుక, లావణ్య, అనూష,, శంకరయ్య, శ్రీను, వసంత, రాధమ్మ తదితరులు పాల్గొన్నారు.