హైదరాబాద్,జూలై22(జనంసాక్షి): బిగ్‌బాస్’ షోను నిలిపివేయాలంటూ దాఖలైన పిల్‌పై ఇవాళ హైకోర్టు విచారణ జరిపింది. ఈ కేసులో వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. అయితే బ్రాడ్‌కాస్టింగ్ నిబంధనలకు విరుద్ధంగా షో ప్రసారం చేస్తున్నారని.. దీనిని నిలిపివేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో దర్శకనిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. బిగ్‌బాస్ షోను సెన్సార్ చేయాలని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాదు అందులో నాగార్జునతో పాటు మరో పదిమందిని కేతిరెడ్డి ప్రతివాదులుగా చేర్చారు.




