బిజెపితోనే అభివృద్ధి సాధ్యం..
పెద్ద శంకరంపేట్: జనం సాక్షి. అక్టోబర్ 8
భారతీయ జనతా పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని పెద్ద శంకరంపేట మండల బిజెపి అధ్యక్షుడు కోణం విఠల్ అన్నారు.. శనివారం పెద్ద శంకరంపేట మండల పరిధిలోని గొట్టిముక్కలలో బిజెపి పార్టీ జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం పలువురు యువకులు బిజెపిలో చేరారు..వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన అన్నారు.. గ్రామీణ స్థాయిలో కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.. ప్రధానమంత్రి మోడీ ఆధ్వర్యంలో భారతదేశంలో అన్ని రంగాలలో ముందు సాగుతుందన్నారు.. కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు పథకాలను కార్యకర్తలు ప్రజలకు వివరించాలన్నారు.. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ బిజెపి నాయకులు మారుతి రెడ్డి , పత్రి రామకృష్ణ ,మండల బిజెపి నాయకులు బండల శ్రావణ్.. తుమ్మ సాయిలు కుమార్, అంజయ్య, విశ్వనాథం, సుభాష్ ,తదితరులు పాల్గొన్నారు. గ్రామానికి చెందిన వార్డ్ సభ్యులు జక్కా రమేష్, యువకులు అనిల్ ,మల్లేష్ నర్సింలు, గోపాల్ ,అశోక్ యాదయ్య, నరసింహులు తో పాటు పలువురు యువకులు బిజెపిలో చేరారు…