బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా జెండా ఆవిష్కరణ

శంకరా పట్నం జనం సాక్షి సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను మండల కేంద్రంలో బిజెపి మండలాధ్యక్షుడు చల్ల ఐలయ్య ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం పురస్కరించుకొని కరీంనగర్ రెవెన్యూ గార్డెన్ లో రక్తదాన శిబిరంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు మాడ వెంకట్ రెడ్డి బిజెపి నాయకులు రక్తదాన శిబిరంలో రక్తదానం చేశారు మోడీ జన్మదిన సందర్భంగా బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు మాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ రక్తదానం చేయడం వలన మరొకరి ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతామని పేర్కొన్నారు నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా ఎలాంటి ఖర్చు లేకుండా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని సూచించారు