Wednesday, 4 November 2026

బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను పరామర్శించిన,

– డోర్నకల్ నియోజకవర్గ బిజెపి నాయకులు.

కురవి సెప్టెంబర్-01 (జనంసాక్షి న్యూస్)

భారతీయ జనతా పార్టీ నాయకులు, హుజూరాబాద్ శాసనసభ్యులు,మాజీ మంత్రి ఈటల రాజేందర్ పితృమూర్తి గత కొద్ది రోజుల క్రితం మృతి చెందడంతో గురువారం డోర్నకల్ నియోజకవర్గ బిజెపి నాయకులు వెళ్లి వారి తండ్రి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి, పరామర్శించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి గుగులోతు లక్ష్మణ్ నాయక్,మాజీ మండల అధ్యక్షుడు బద్రి సేనగౌడ్, డోర్నకల్ మండల అధ్యక్షులు నగేష్, డోర్నకల్ మండల ఉపాధ్యక్షులు దేవా,గణేష్, రెహ్మాన్,సుమన్ తదితరులు పాల్గొన్నారు.