ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆసరా పింఛన్ల పంపిణీ

 

టేకులపల్లి ఎంపీడీవో బాలరాజు

టేకులపల్లి ,ఆగస్టు1( జనం సాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన పింఛన్లను శుక్రవారం ఇల్లందు శాసనసభ్యురాలు బానోతు హరిప్రియ చేతులమీదుగా పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు స్థానిక ఎంపీడీవో డి బాలరాజు తెలిపారు. మధ్యాహ్నం ఒంటిగంటకు టేకులపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డు నందు పింఛన్లు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య పాల్గొంటారని ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఎలెక్ట్రానిక్ & ప్రింట్ మీడియా వారు తప్పకుండా హాజరయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు