బిజెపి కార్యకర్తల జోలికొస్తే ఊరుకునేది లేదు….

నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి సింగాయిపల్లి గోపి..

చిలప్ చేడ్/సెప్టెంబర్/జనంసాక్షి :- బిజెపి కార్యకర్తల జోలికొస్తే ఊరుకునేది లేదని నియోజకవర్గ ఇన్చార్జి సింగాయిపల్లి గోపి అన్నారు చిలప్ చేడ్ మండలంలోని అజ్జమర్రి గ్రామంలో చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి గ్రామంలో అన్ని పనులు పూర్తయినయ్ అనగా గ్రామానికి చెందిన యువకుడు పన్యాల రాజ్ కుమార్ మీరు గ్రామాన్ని దత్తత తీసుకుని ఏడు సంవత్సరాలు గడుస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చలేరని గ్రామంలోని చెరువు కట్ట పైన సిసి రోడ్డు వేసి డివైడర్ నిర్మిస్తామని ఏడు సంవత్సరాలు అయినప్పటికీ ఏటువంటి పనులు జరగలేదని ఎమ్మెల్యేను నిలదీయడంతో.దురుసుగా అరె బట్టేబాజ్ అంటూ వీడిని లోపల వేయాలని ఎమ్మెల్యే ఎస్ఐతో చెప్పడం ఎంతవరకు సమంజసం అన్నారు దీని సుమోటోగా తీసుకొని స్థానిక ఎస్సై కేసు నమోదు చేయాలని అన్నారు తెరాస ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రైతులకు రుణమాఫీ చేయలేదని అలాగే నియోజకవర్గంలో డబల్ బెడ్ రూమ్ ఉసేలేదని అజ్జమర్రి గ్రామానికి ఇరువైపులా ఉన్న రోడ్డు గుంతల మయంగా మారడం ఆయనకు కనిపించలేదా ఈగ్రామంలో ఒక్క బెడ్ రూమ్ అయినా మంజూరు చేశారా అని ఆయన నిలదీశారు గ్రామాన్ని అభివృద్ధి చేయలేక.అభివృద్ధి జరగలేదని ప్రశ్నించిన యువకుడిని బెదిరింపులకు గురి చేస్తే ఊరుకునేది లేదని ఆయన అన్నారు గ్రామ అభివృద్ధిపై ఇంకా పోరాడాలని పన్యాల రాజ్ కుమార్ కు మద్దతు తెలిపి శాలువాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో బిజెపి నియోజకవర్గ నాయకులు వల్దాస్ మల్లేష్ గౌడ్ మండల బిజెపి అధ్యక్షులు దశరథ్ ఉపాధ్యక్షులు లస్కర్ వెంకటేశం కార్యదర్శి సంతోష్ బిజెపి గ్రామ అధ్యక్షులు యాదగిరి మండల నాయకులు శ్రీకాంత్ గౌడ్ గొలుసుగారి సత్యం పన్యాల రాజ్ కుమార్ దశరథ్ ఈశ్వర్ తదితరులు �