*బిజెపి జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షులుగా న్యాయవాది బద్దం గంగాధర్ రెడ్డి నియామకం*

మెట్పల్లి టౌన్ : జనంసాక్షి
మెట్పల్లి పట్టణ సీనియర్ న్యాయవాది బిజెపి సీనియర్ నాయకులు బద్దం గంగాధర్ రెడ్డి ని బిజెపి పార్టీ జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా, జిల్లా అధ్యక్షులు పైడిపెళ్లి సత్య నారాయణ రావు నియమాక పత్రాన్ని బద్దం గంగాధర్ రెడ్డి కి అందించారు.
జగిత్యాల జిల్లా బిజెపి పార్టీ ఉపాధ్యక్షులుగా ఎన్నికకు సహకారం చేసిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు జిల్లా అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణకు, మరియు జిల్లా పట్టణ నాయకులకు, ఉపాధ్యక్షులుగా ఎన్నికైన గంగాధర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ బిజెపి ముఖ్య నాయకులు కార్యకర్తలు నూతనంగా ఎన్నికైన జిల్లా ఉపాధ్యక్షులు గంగాధర్ రెడ్డికి శుభాభినందనాలు తెలిపారు .