మేనిఫెస్టోపై ఓవైసీ ఎద్దేవా
హైదరాబాద్,నవంబర్12(జనంసాక్షి): భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విభిన్నంగా స్పందించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఒక లక్ష ఆవులను పంపిణీ చేస్తామని ఆ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకుందని ఓవైసీ గుర్తు చేశారు. మరి నాకు కూడా ఆవులు ఇస్తారా? అని బీజేపీ నేతలను ఓవైసీ ప్రశ్నించారు. ఒక వేళ నాకు ఆవులను ఇస్తే గౌరవంగా చూసుకుంటానని ఓవైసీ హావిూనిచ్చారు. అసలు నాకు ఆవులను ఇస్తారా? అన్నది తన ప్రశ్న అని పేర్కొన్న ఓవైసీ.. నవ్వులాట కాదిది.. దీని గురించి ఒకసారి ఆలోచించాలని ఆయన సూచించారు.




