Wednesday, 4 November 2026

బిజెపి 32 ఎన్నికల కమిటీలు: దత్తాత్రేయ

హైదరాబాద్‌,అక్టోబర్‌13(జ‌నంసాక్షి):   ఎన్నికల కోసం 32 కమిటీలు వేసినట్లు బీజేపీ నేత, ఎంపీ దత్తాత్రేయ తెలిపారు. ఈ కమిటీల ద్వారా ఎన్నికల్లో కార్యక్రమాలు చేస్తామని అన్నారు. ఒక్కో కమిటీ ఒక్కో బాధ్యతను నిర్వర్తిస్తుందని అన్నారు. ఇదిలావుంటే  కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేకి అని హరీశ్‌రావు అనడం హాస్యాస్పదం అన్నారు. మద్దతు ధర అడిగిన రైతులను జైలులో పెట్టిన ఘనత టీఆర్‌ఎస్‌దేనని ఎద్దేవాచేశారు. తెలంగాణలో 4500మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తుచేశారు. అమిత్‌ షా అడిగిన ప్రశ్నలకు టీఆర్‌ఎస్‌ సమాధానం చెప్పలేకపోతోందన్నారు. బీజేపీకి భయపడే కాంగ్రెస్‌ తెలంగాణను ఇచ్చిందని వెల్లడించారు. బిజెపి వచ్చిన తరవాత ఇస్తే క్రెడిట్‌ బిజెపికి పోతుందన్న ఆలోచనతో కాంగ్రెస్‌ ముందుకు వచ్చిందన్నారు.