బిజెవైయం అభ్యర్దికి పరామర్శించిన బలరాం జాధవ్.

నెరడిగొండఆగస్టు5(జనంసాక్షి):
బాసర ట్రిపుల్ ఐటీలో ఇటీవల నెలకొన్న సమస్యలను ప్రస్తుతం ఉన్న మెస్ కాంట్రాక్టర్లను రద్దు చేయాలని విద్యార్థులు తెలిపిన నిరసనలో బాగంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ  బాసర ట్రిపుల్ ఐటి ముట్టడికి పిలుపు మేరకు అక్కడికి మూడు రోజుల క్రితం వెళ్తున్న ఆదిలాబాద్ జిల్లా పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావు బాసర ట్రిపుల్ ఐటికి వెళ్తున్న సందర్భంలో పోలీసులు అడ్డగించడంతో జరిగిన తోపులాటలో నిర్మల్ జిల్లా చించోలి గ్రామానికి చెందిన బిజెవైయం కుమ్మరి వెంకటేష్ కిగాయలై కాలికి ఫ్యాక్చర్ జరిగింది.ఇట్టి విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ శుక్రవారం రోజున వారి ఇంటికి వెల్లి కలిసి పరామర్శించి బాగోగులు అడిగి తెలుసుకున్నారు.బాధితులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Attachments area