Wednesday, 4 November 2026

ఎర్రవల్లి సర్పంచ్ పై ఎన్నికల అధికారికి పిర్యాదు

కొండపాక(జనంసాక్షి)ఆగస్టు5: ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన కొండపాక మండలం ఎర్రవల్లి సర్పంచ్ బాలామణి పై చర్యలు తీసుకోవాలని ఆమెపై పోటీ చేసిన అల్లం సీతామహాలక్ష్మి రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. పంచాయతీ ఎన్నికల సమయంలో బాలమణి మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం లోని ఓటర్ కార్డ్ కలిగి ఉన్న గజ్వేల్ నియోజకవర్గం కొండపాక మండలం ఎర్రవల్లి గ్రామం లో ఓటర్ కార్డును సృష్టించుకుని పోటీ చేసిందని ఆరో పించారు. తప్పుడు సమాచారం సమర్పించిన బాలమణిపై తగు చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Attachments area