Wednesday, 4 November 2026

బిసి రిజర్వేషన్లు తేల్చాకే పంచాయితీ ఎన్నికలు

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్‌,జూన్‌26(జ‌నం సాక్షి):  తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్‌ వేసింది. రిజర్వేషన్ల పక్రియ తేల్చేదాకా పంచాయతీ ఎన్నికలు నిర్వహించొద్దని కోర్టు ఆదేశించింది. బీసీల రిజర్వేషన్ల పక్రియ సరిగా లేదంటూ కాంగ్రెస్‌ నేత దాసోజు శ్రవణ్‌ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. బీసీలకు ఏ ప్రాతిపదికన 34 శాతం రిజర్వేషన్లు కేటాయించారని ప్రభుత్వ తరుపు న్యాయవాదిని  ప్రశ్నించింది. రెండుమూడు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్‌కు సిద్ధమవుతున్నట్లు అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ తెలిపారు. బీసీ-ఏ, బీ, సీ రిజర్వేషన్ల పక్రియ తేల్చాకే ఎన్నికలకు వెళ్లాలని ఏజీకి హైకోర్టు సూచించింది. ఇప్పటికే సర్పంచ్‌, వార్డు సభ్యుల పదవీ కాలం ముగిసిందని అడ్వకేట్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు. అయితే రిజర్వేషన్లు తేలకుండా ఎన్నికల ప్రక్రియ చేపట్టారదని సూచించింది.