– బి ఆర్ ఎస్ పార్టీ కి విరాళాల వెల్లువ.. !
– 20 వేలు విరాళంగా ఇచ్చిన వివిధ సంఘాలు..
– సీఎం కేసీఆర్ , మంత్రి హరీష్ రావు కు మద్దతుగా విరాళాలు..
సిద్దిపేట బ్యూరో అక్టోబర్ 08(జనం సాక్షి)సిద్దిపేట నియోజకవర్గం ప్రయివేటు ఎలెక్ట్రిషన్ అసోసియేషన్ 10 వేలు , హౌసింగ్ బోర్డు చైతన్యపూరి కాలనీ వడ్డెర సంఘం 10వేలు విరాళంగా సిద్దిపేట పార్టీ పట్టణ అధ్యక్షులు కొండం సంపత్ రెడ్డి కి అందజేశారు. ఈ సందర్భంగా అందజేసిన వారిలో సిద్దిపేట ప్రయివేటు ఎలెక్ట్రిషన్ అసోసియేషన్ అధ్యక్షులు ఆకుల ప్రశాంత్ , సెక్రెటరీ రవి కిరణ్ , జాయింట్ సెక్రటరీ బాబు, కోశాధికారి లక్ష్మన మూర్తి , వడ్డెర సంఘం అధ్యక్షుడు బొదాసు మల్లేశం , శివరాత్రి బాలయ్య , బొదాసు రాజు , మల్లేశం , నర్సింహులు , రాం చంద్రం దేశెట్టి యాదగిరి తదితరులు ఉన్నారు.