బి జోన్ రజక సంఘం నూతన కమిటీ ఎన్నిక

రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బి జోన్ రజక సంఘం నూతన కమిటీని శనివారం ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా నడిగోట తిరుపతి, ప్రధాన కార్యదర్శిగా మణికంఠ రాజయ్య, కోశాధికారిగా రెడ్డి రాజుల తిరుపతి, ఉపాధ్యక్షునిగా నడిగోట శంకర్, కార్యదర్శిగా పున్నం సమ్మయ్య, మహిళాఅధ్యక్షురాలిగా జాలిగపు రాజేశ్వరి లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ రజకుల సంక్షేమం, అభివృద్ధికై పాటు పడతామని అన్నారు. రజకుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కార దిశగా కృషి చేస్తామని తెలిపారు.