బి.వి.ఆర్ ఐటి ఆధ్వర్యంలో ఐ వో టి పై విద్యార్థులకు అవగాహన
నర్సాపూర్. సెప్టెంబర్ 17 ( జనం సాక్షి): నర్సాపూర్ సమీపంలో ని
బి.వి.ఆర్ ఐటి ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో గురువారం నాడు నర్సాపూర్ పట్టణంలోని గవర్నమెంట్ హై స్కూల్ విద్యార్థులకు ఐ వో టి పై అవగాహన కల్పించారు. కళాశాలకు చెందిన 30 మంది విద్యార్థులు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ప్రాజెక్టు పరికరాలపై అవగాహన కల్పించారు. సదస్సు కు 200 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీ ప్రసాద్, గవర్నమెంట్ హై స్కూల్ ప్రిన్సిపల్ సత్యనారాయణ, కళాశాల ప్రతినిధులు దశరధ రామయ్య, బీమా, లెక్చరర్లు అమరేందర్ రెడ్డి, ఏవో లు బాపిరాజు, అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ReplyForward
|