బీఆరేస్ పార్టీ ప్రజావ్యతిరేక పాలన నచ్చక కాంగ్రెస్ పార్టీలో చేరిన గోనుగొప్పుల గ్రామ ప్రజలు
భీంగల్ ప్రతినిధి(జనంసాక్షి):భీంగల్ మండలంలోని గోన్ గొప్పుల గ్రామానికి చెందిన సుమారు యాభై మంది బీఅరెస్ పార్టీ నాయకులు గురువారం నాడు బాల్కొండ కాంగ్రెస్ నాయకుడు ముత్యాల సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సునీల్ రెడ్డి మాట్లాడుతూ బీఅరెస్ పార్టీ ప్రజా వ్యతిరేక పాలనపై విసుగుచెంది మంత్రి ప్రశాంత్ రెడ్డి నిరంకుసత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు.కాంగ్రెస్ కార్యకర్తల కృషితో రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గంలో,రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని అన్నారు.
ఇకముందు పెద్ద ఎత్తున బీఅరెస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఉంటాయని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చరణ్ గౌడ్,భోజగౌడ్ తదితరులు పాల్గొన్నారు.