బీఆర్‌ఎస్‌ పార్టీ లోకి చేరికలు

జనంసాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఇసంపెల్లి శ్రీనివాస్‌, ఉపాధ్యక్షుడు గొర్రెపల్లి సురేష్‌, యూత్‌ అధ్యక్షుడు ఉడుత సంజీవ్‌, కార్యకర్త ఉడుత సతీష్‌లు కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. బుధవారం మంథని పట్టణంలోని రాజగృహాలో గ్రామసర్పంచ్‌ దండె ప్రసాద్‌ ఆధ్వర్యంలో వారికి జెడ్పీ చైర్మన్‌ ఫుట్ట మధూకర్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. బీఆర్‌ఎస్‌ పార్టీలో ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని, కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తుందన్నారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు సరైన గుర్తింపు ఇచ్చి పదవులు ఇచ్చిన చరిత్ర బీఆర్‌ఎస్‌ పార్టీకి ఉందని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరిన ప్రతి ఒక్కరు పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని, కష్టపడితేనే మంచి ఫలితాలు సాధించుకోగలమని ఆయన అన్నారు.

తాజావార్తలు