బీఎస్పీకి ఒక్క అవకాశం ఇవ్వండి పెద్దాయన.

బీఎస్పీకి ఒక్క అవకాశం ఇవ్వండి పెద్దాయన.

బిఎస్పి ని ఆదరించి ఆశీర్వదించండి.
బిఎస్ఫిఆధ్వర్యంలో గడపగడపకు ప్రచారం
బీఎస్పీ తాండూర్ ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రశేఖర్ ముదిరాజ్ .తాండూరు సెప్టెంబర్ 28….. రాబోయే ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని బీఎస్పీ తాండూర్ ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రశేఖర్ ముదిరాజ్ పేర్కొన్నారు.గురువారం యలాల్ మండలం గంగసాగర్ గ్రామంలో బీఎస్పీ తాండూర్ ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రశేఖర్ ముదిరాజ్ గడప గడపకు తిరిగి ఏనుగు గుర్తు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీని తట్టుకునే శక్తి బిఎస్పి పార్టీకే ఉందని తెలిపారు.బిఎస్పి పార్టీ నే అసలు సిసలైన ప్రతిపక్ష పార్టీగా మారిందన్నారు. తాండూరు నియోజకవర్గంలో ఉన్న బహుజన, అణగారిన వర్గాలు బిఎస్పి ఏనుగు గుర్తు వైపు మొగ్గు చూపే అవకాశం ఉందన్నారు. నియోజకవర్గ ప్రజలు బిఎస్పీని ఆదరించి ఆశీర్వదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ తాండూర్ అసెంబ్లీ ఇంచార్జ్ సత్యమూర్తి, తాండూర్ నియోజకవర్గం అద్యక్షులు పి.అరుణ్ రాజ్, యాలల్ మండల అధ్యక్షుడు ఎం. కృష్ణ, యాలల్ జనరల్ సెక్రెటరీ కృష్ణ గౌడ్, పెద్దేముల్ మండల అధ్యక్షుడు ఎస్. రమేష్, పార్టీ నాయకులు క్రాంతి,రవి ముదిరాజ్
తోపాటు తదితరులు పాల్గొన్నారు.