Tuesday, 3 November 2026

సంఘమిత్ర(శివాజీ)యూత్ వారి గణేష్ నిమర్జన ఉత్సవాలు.

సంఘమిత్ర(శివాజీ)యూత్ వారి గణేష్ నిమర్జన ఉత్సవాలు.

రాయికల్, సెప్టెంబర్ 28 (జనంసాక్షి)స్థానిక శివాజీ విగ్రహం దగ్గర గల ప్రతిష్టించిన గణేశుడి లడ్డు వేలం పాటలో పటేల్ శ్రీకాంత్ రెడ్డి గారు కైవసం చేసుకోవడం జరిగింది. శ్రీకాంత్ గారు మాట్లాడుతూ నవరాత్రులు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలందుకున్న గణనాథుని లడ్డును వేలం పాటలో పాల్గొని కైవసం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. సంఘమిత్ర యూత్ సభ్యులు లడ్డు ప్రసాదాన్ని అందజేసి శాల్వాతో సత్కరించారు..ఈ కార్యక్రమంలో సంఘమిత్ర (శివాజీ)యూత్ అధ్యక్షులు పాలడుగు రంజిత్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.