బీఎస్పీ తోనే అభివృద్ధి సాధ్యం
రాష్ట్ర కార్య వర్గ సభ్యులు సిద్ధూ రావణ్
జహీరాబాద్ సెప్టెంబర్ 21 (జనం సాక్షి) బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్య వర్గసభ్యులు సిద్దు రావణ్ ఆధ్వర్యంలో ఝారసంగం మండలా నికి చెందిన యువకులు బీఎస్పీ పార్టీ లో చేరడం జరిగింది. ఈ సందర్భంగా సిద్దు రావణ్ మాట్లాడుతూ రాబోయేది బహుజన రాజ్యమే, అందుకు సిద్ధం అవ్వాలని తెలియజేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిద్దు రావణ్, పి బాబు రావు జిల్లా ఇంచార్జ్, నాయకులు, యాదయ్య, ఏసురత్నం, అభినవ్ ,రాజు, శ్రీశైలం ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.