Wednesday, 4 November 2026

బీచుపల్లి కృష్ణానదిలో మహిళ ఆత్మహత్య యత్నం

గజ ఈతగాళ్లు సహాయంతో మహిళని కాపాడిన పోలీసులు

ఇటిక్యాల (జనంసాక్షి) అక్టోబర్ 8 కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు యత్నించిన ఘటన మండల పరిధిలోని బీచుపల్లి కృష్ణానది పుష్కర ఘాటు దగ్గర శనివారం చోటు చేసుకుంది. ఇటిక్యాల ఎస్సై గోకారి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండల పరిధిలోని గోవర్ధనగిరి గ్రామానికి చెందిన సింగనమోని తెలుగు బాలమ్మ అనే మహిళ మనస్థాపం చెంది బీచుపల్లి కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడుతుండగా గమనించిన పోలీసులు గజత గల సహాయంతో కాపాడినట్లు ఆయన తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులకు, బాలమ్మకు, కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం జరిగిందన్నారు. మహిళను కాపాడిన గజతగాళ్లను, పోలీస్ సిబ్బందిని ఎస్సై గోకారి అభినందించారు.