సికింద్రాబాద్ (జనం సాక్షి ) తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర సంఘ నాయకులు, వ్యాపార వేత్త మద్దెర్ల శ్యామ్ సుందర్ తన అనుచరులతో కలిసి బీజేపీ లో జాయిన్ అయ్యారు. బౌద్ధనగర్ కార్యాలయం నుండి నాయకులు, కార్యకర్తలు, మహిళలతో ర్యాలీగా వెళ్లి నర్సాపూర్ లో కేంద్ర మంత్రి భుపేందర్ యాదవ్, తరుణ్ చౌహ, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సమక్షంలో చేరారు. కేంద్ర మంత్రి భుపేందర్ యాదవ్, శ్యామ్ కు బీజేపీ కండువా ను కాప్పారు. ఈ సందర్భంగా సోమవారం బౌద్ధ నగర్ కార్యక్రమంలో శ్యామ్ సుందర్ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు, ఓబీసీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ ఆశీస్సులతో బీజేపీలో చేరానని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్నామని, బీజేపీ సిద్ధాంతాలకు ముందుకు తీసుకు వెళ్తానన్నారు. బీజేపీని మరింత పటిష్టం చేస్తానన్నారు.
బీజేపీలో చేరిన గంగపుత్ర రాష్ట్ర నాయకుడు శ్యామ్ సుందర్ …




