బీసీలు రాజ్యాధికారం దిశగా ముందుకు పోవాలి
కుబీర్ ( జనం సాక్షి ); మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీగా నియమితులైన కుబీర్ మండలం పల్సి గ్రామానికి చెందిన కొట్టే హన్మండ్లు ఆదివారం కుల సంఘ సభ్యులు, యువజన సంఘం నాయకులు, నాయకులతో కలిసి శాల్వా పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్నూరు కాపు బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. బీసీలు సామాజికంగా, ఆర్థికంగా రాజకీయంగా రాజ్యాధికారం దిశగా ముందుకు పోవాలన్నారు. రాష్ట్ర కార్యవర్గంలో ఆర్గనైజింగ్ సెక్రటరీగా ముధోల్ నియోజకవర్గం, నుంచి ఎన్నుకున్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేశారు. సహకరించిన రాష్ట్ర మున్నూరు కాపు అధ్యక్షులు కొండ దేవయ్య కు ధన్యవాదాలు తెలిపారు.అదేవిధంగా ముధోల్ నియోజకవర్గ కుల సోదరులందరికీ కృతజ్ఞత భావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఉపాధ్యక్షుడు తాలోడ్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ పంతుల దేవేందర్, బైంసా మాజీ కౌన్సిలర్ బోసి కిషన్, జై ప్రకాష్ సొసైటీ అధ్యక్షుడు శ్రీనివాస్, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యుడు ముత్యపు బాలరాజు, డాక్టర్ రాజన్న, తోట రాందాస్, మాజీ ఎంపిటిసి తోకల రాములు, కుల సంఘ అధ్యక్షులు, యువజన సంఘ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.