Friday, 6 November 2026

బీసీ ఓటర్ల గుర్తింపు పక్రియ ప్రారంభం

హైదరాబాద్‌, మే18(జ‌నం సాక్షి ) : తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నగారా మోగనున్న వేళ శుక్రవారం నుంచి వెనుకబడిన తరగతులు ఓటర్ల గుర్తింపు పక్రియ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 12,751 గ్రామ పంచాయితీల్లో జూన్‌ 1 నాటికి ఈ పక్రియను పంచాయితీరాజ్‌ శాఖ ముగించనుంది. బీసీ ఓటర్ల గుర్తింపు పక్రియ పూర్తవ్వగానే సర్పంచులు, వార్డు మెంబర్ల వారీగా ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయనుంది. గ్రామపంచాయితీలకు సంబంధించిన ఓటర్ల జాబితా ముసాయిదాను గత నెల 30న ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. అన్ని గ్రామపంచాయితీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు కోసం షెడ్యూల్‌ను సైతం ఎన్నికల కమిషన్‌ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు బదిలీలు చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో.. ఆ పక్రియ పూర్తయ్యాకే ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయాలని నిర్ణయించారు.