బుద్దుల రాజు కుటుంబానికి ఆర్థిక సహాయం.

మల్లాపూర్ ( జనం సాక్షి )అక్టోబర్: 23 మండలంలోని ఓబులాపూర్ గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించిన టిఆర్ఎస్ కార్యకర్త బుద్ధుల రాజుకు టిఆర్ఎస్ యువ నాయకుడు డాక్టర్ సంజయ్ కుమార్ విషయాన్ని తెలుసుకొనివారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.రాజు కుటుంబానికి తక్షణ సహాయం పదివేల నగదునుస్థానిక జెడ్పిటిసి సంధి రెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా వారి కుటుంబానికి అందజేశారు. అందజేసిన వారిలో మల్లాపూర్ పట్టణ టిఆర్ఎస్ అధ్యక్షులు లింగస్వామి,సురేష్, రాజారెడ్డి, స్థానిక సర్పంచ్ రవి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చిట్యాల లక్ష్మణ్ తదితరులు ఉన్నారు