సీసీ రోడ్లు నిర్మాణ పనులు ప్రారంభించిన వార్డు మెంబర్
అశ్వరావుపేట అక్టోబర్ 23( జనం సాక్షి ) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పల్లెలు అభివృద్ధి ధ్యేయంగా పనులు చేయటంలో ముందుంటుంది. పంచాయతీల అభివృద్ధి కొరకు మండలంలోని తిరుమల కుంటలో లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు నిర్మాణాలు జరుగుతున్నాయి. తిరుమల కుంట ఎస్సీ కాలనీ లో గోదా దేవేంద్రుడు ఇంటి వద్ద నుండి ఆవుల దమయంతి ఇంటి వరకు సిసి రోడ్డు నిర్మాణానికి వార్డ్ మెంబర్ వాణి కొబ్బరి కాయలు కొట్టి పనులు ప్రారంభించారు. 130 మీటర్ల పొడవునా ఎమ్మెల్యే గ్రాంట్ 5 లక్షల వ్యయంతో ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. తిరుమల కుంట కాలనీలో పాఠశాల భవనం నుండి మడకం వారి ఇంటి వద్ద వరకు సి సి రోడ్డు నిర్మాణం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సున్నం రామ లక్ష్మయ్య, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.