బురిడీ కొట్టిన ధరణి పోర్టల్.

– వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర నాయకుడు గుగులోతు రాము నాయక్.
తొర్రూరు 23 ఆగస్టు (జనంసాక్షి )
 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టా పాస్ పుస్తకం వచ్చిన కూడా  సంబంధం లేకుండా మరుక్షణమే వేరే వారి పేరు మీద భూమి మారడం సిగ్గుచేటని,వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర నాయకుడు గుగులోత్ రాము నాయక్ అన్నారు.మంగళవారం తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పది ఎకరాల భూమిని అధికార పార్టీ నేతల అండతో మా భూమిని కాపాదలని,స్థానిక మున్సిపల్ కమిషనర్ గుండె బాబుకు వినతి పత్రం అందజేశారు.అనంతరం రామునాయక్ మాట్లాడుతూ…మా బాధలు ఎవరు వినాలి.ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉందని,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మొండి వైఖరిని ఇకనైనా మారి రైతులకు తగిన న్యాయం చేయాలని,2021లో ఆనాడు ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ హరికోట్ల రవి అనే అధికారి అధికార పార్టీ నేతలతో చేయి కలిపి రైతులను మోసం చేయడం జరిగిందని మండిపడ్డారు.బాధితులకు తక్షణమే న్యాయం చేయకపోతే మహబూబాబాద్ జిల్లా నుండి భారీ ఎత్తున రాస్తారోకోలు మరియు నిరసనలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పాలకుర్తి నియోజకవర్గం కోఆర్డినేటర్ సింగారం రవీందర్,రాయపర్తి మండలాధ్యక్షుడు భూనావత్ గోపాల్ నాయక్,వెంకటేష్ నాయక్,సతీష్ నాయక్,నరేష్ తదితరులు పాల్గొన్నారు.