బైక్ ర్యాలీని జయప్రదం చేయండి

రాజాపేట, అక్టోబర్23 (జనంసాక్షి) : బి ఎన్ ఆర్ కే ఎస్ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈనెల 31 తారీకు అన్ని జిల్లాల కలెక్టర్ ని కలిసేందుకు బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి రాస మల్ల కొమురయ్య కోరారు. ఆదివారం కరపత్రాలను విడుదల చేసి మాట్లాడారు. కార్మికుల హక్కుల కోసం ఉద్యమించాలని కార్మికులంతా ఐక్యతతో హక్కులు సాధించుకోవాలి అన్నారు. గతంలో మాదిరిగా లేబరు కార్డులు మంజూరు చేయాలని, నిర్మాణ కార్మికులకు 15 లక్షల జీవిత బీమా, ప్రమాదవశాత్తు మరణించిన వారికి 5 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలన్నారు. మండల అధ్యక్షులు కూర ఉప్పలయ్య సెంట్రింగ్ యూనియన్ మండల అధ్యక్షులు నీలా లక్ష్మణ్ రాజపేట గ్రామ అధ్యక్షులు ఎర్ర గో కుల చంద్రయ్య కొండేటి గ్రామ అధ్యక్షులు కర్రె శేఖర్ సింగారం గ్రామ అధ్యక్షులు మన్యం బాలయ్య రాజపేట సెంట్రింగ్ మేస్త్రి పంజా నరసింహులు తుర్కపల్లి మండలం కేంద్రంలో గ్రామం ఇందిరానగర్ గ్రామ అధ్యక్షులు పల్లపు జాంగిర్ చింతకింది నరసింహులు దొంతుల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.