బోటు నడిపిన మంత్రి కేటీఆర్
రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఆగస్టు 18.(జనంసాక్షి). ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సిరిసిల్ల పట్టణ శివారులోని మద్యమాను జలాశయంలో బోటును పరిగెత్తించారు. శుక్రవారం జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్., మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి పర్యాటకులకు మధ్య మానేరు వద్ద ఏర్పాటుచేసిన బోటింగ్ యూనిట్ ను ప్రారంభించారు. అనంతరం స్వయంగా బోటులు పరిగెత్తిస్తూ ఆశ్చర్యపరిచారు. మధ్య మానేరు అందాలను వీక్షిస్తూ ఆహ్లాదాన్ని అందించడం కోసం బోటింగ్ సౌకర్యంగా ఉంటుందని తెలిపారు.కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, మానకొండూరు శాసనసభ్యులు రసమయి బాలకిషన్ పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు ఉన్నారు.