బోధనా ఫీజులపై నేడు సీఎం సమీక్ష
హైదరాబాద్: బోధనా ఫీజుల చెల్లింపు, ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ తేదీలు, ఫీజు విధానంపై ముఖ్యమంత్రి ఈ రోజు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఖమ్మం జిల్లా పర్యటన ముగించుకొని వచ్చాక మంత్రి వర్గ ఉపసంఘం నేతలతో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూలు నోటిఫి కేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది.