బోధన్ పట్టణ పోలీసుల అధ్వర్యంలో స్టడీ మెటీరియల్ పంపిణీ

ఫోటో రైటప్, 20 బీడీఎన్, మెటీరియల్ ను అందిస్తున్న సీఐ ప్రేమ్ కుమార్
బోధన్, జూలై   ( జనంసాక్షి ) :  పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పరీక్షలకు సిద్ధం అవుతున్న నిరుద్యోగ యువతకు బుధవారం బోధన్ పట్టణ సీఐ బీడీ ప్రేమ్ కుమార్ అధ్వర్యంలో స్టడీ మెటీరియల్ ను అందించారు. ఈ సందర్భంగా బోధన్ పట్టణ సీఐ బీడీ ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ, నిరుద్యోగ యువత ఎంతో ఇష్టంతో కష్టపడి పోలీసు ఉద్యోగం సంపాదించుకోవాలని సూచించారు. ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా ప్రశాంతంగా పరీక్షలకు హాజరు కావాలని సీఐ బీడీ ప్రేమ్ కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో పోటీ అభ్యర్థులు పాల్గొన్నారు.
Attachments area