బోయిన్ పల్లి మండలంలో వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాల రైతులను ఆదుకోవాలి-ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ చొప్పదండి నియోజకవర్గం ఇంచార్జ్ ముత్యాల విజయ్ కుమార్ డిమాండ్
బోయిన్ పల్లి జూలై 29 (జనం సాక్షి) రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పలి మండలంలో అకాల వర్షాలతో తీవ్రంగా పంట నష్టాలతో దెబ్బతిన్న రైతులను తక్షణమే ఆదుకోవాలని ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ చొప్పదండి నియోజకవర్గం ఇంచార్జ్ ముత్యాల విజయ్ కుమార్ ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేదు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. రాష్ట్రంలో రైతులకు ఇచ్చిన హామీలను మరిచారని అదేవిధంగా గతంలో పంట నష్టం అని చెప్పి రైతులను మోసం చేశారని వరదతో అకాల పంట నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ శ్రేణులతో ఉద్యమిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.