Tuesday, 3 November 2026

మతసామరస్యానికి ప్రతీక మొహరం.

మల్కాజిగిరి.జనంసాక్షి.జూలై 29.
మొహరం పండుగ త్యాగానికి,ఐక్యతకు, మతసామరస్యానికి ప్రతీక అని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేర్కొన్నారు.మొహరం వేడుకల సందర్భంగా నరసింహారెడ్డి నగర్ లోని పీరీల కొట్టంలో ఏర్పాటు చేసిన పీర్ల గుండాలను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.మత పెద్దలు ఆయనను శాలువాలతో సత్కరించి ప్రార్థనలు చేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.తెలంగాణలో మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహరం పండుగను అందరూ కలిసిమెలిసి ఆనందంగా జరుపుకోవాలని కోరారు.ఈకార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్,సతీష్ కుమార్, గుండా నిరంజన్,రాము యాదవ్, సంతోష్ రామ్ దాస్,కోటేష్ కుమార్, హోలీ,బాబా,జహీర్,ఖాదర్,లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.