బ్యాంకును సందర్శించిన ఎంపీ పోతుగంటి రాములు
జనం సాక్షి,వంగూర్:
మండల కేంద్రంలోని ఐఓబి బ్యాంకులో అసైన్డ్ ల్యాండ్లపైన క్రాఫ్ లోన్లు ఇస్తా లేరని రైతులు ఎంపీ రాములుకు మొరపెట్టుకున్నారు. ఇట్టి విషయంపై ఎంపీ రాములు ఐఓబి బ్యాంకు మేనేజర్ తో సందర్శించి అసైన్డ్ ల్యాండ్ పైన క్రాప్ లోన్లు ఇవ్వాలని మేనేజర్ కు సూచించారు. అలాగే క్రాప్ లోన్లు తీసుకున్న ప్రతి రైతులు మిత్తి కట్టి క్రాప్ లోన్ రెన్యువల్ చేయవలసిందిగా తెలిపారు. వెంటనే మేనేజర్ రేపటినుండి అసైన్డ్ ల్యాండ్లకు క్రాప్ లోన్లు ఇస్తానని ఎంపీ రాములుకు జారీ చేశారు. మరియు బ్యాంకులో సరైన స్టాప్ లేనందున పని భారం ఎక్కువగా ఉన్నది కాబట్టి దయచేసి వేరే బ్యాంకు ఏర్పాటు చేయాల్సిందిగా ఎంపీ రాములుని రైతులు కోరారు. మరియు కస్తూర్బా గాంధీ పాఠశాలకు ఎంపీ నిధుల కింద ఐదు లక్షల రూపాయలు మంజూరు చేశారు. అట్టి రూపాయలతో విద్యార్థుల అన్ని వసతుల ఏర్పాట్లకు వాడవలసిందిగా ఎంపి రాములు సూచించారు.