గుండాల,ఫిబ్రవరి09(జనంసాక్షి);పోడు సమస్యలను టీడీపీ నాయకులు మాట్లాడుతుంటే గిరిజనేతరులని వ్యక్తి గత విమర్శలు చేస్తున్న టీ అర్ ఎస్ నాయకులకు అంత ఉలిక్కిపాటు దేనికి అని టీడీపీ మండల అధ్యక్షుడు తోలెం సాంబయ్య మరియు ఇతర నాయకులు అన్నారు.పలు గ్రామాల్లో ఫారెస్ట్ అధికారుల కాళ్ళ మీద పడ్డ కనికరించకుండా జేసీబీ లతో కందకాలు తోవ్విన ఫారెస్ట్ అధికారుల గురించి ఎమ్మెల్యే రేగా కాంతారావు నియోజకవర్గంలో జరుగుతున్న పోడుభూముల సమస్యలపై మాట్లాడుతుంటే టీ అర్ ఎస్ నాయకుల వ్యక్తిగత దూషణలు వారి కుటీల రాజకీయ బుద్ధిని చూపిస్తున్నాయని,నియోజకవర్గంలో జరిగే ఈ పరిణామాలు చూసుకోవాల్సింది ఎమ్మెల్యే కదా అని,అందులోనూ ఎమ్మెల్యే గా గెలవడానికి మేము పోరాటం చేసాం తప్పితే ఇప్పుడు టీఆర్ ఎస్ ఉన్న వారు కాదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఎస్కే సంధాని,అప్పారావు,నరసింహులు, మొల్కం మధు,కల్తీ పెద్ద బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
బ్రతుకు తెరువు కోసం రాజకీయం చేసే వాళ్ళకి మా మీద విమర్శ చేసే హక్కు లేదు




