|
ఖైరతాబాద్: సెప్టెంబర్ 21 (జనం సాక్షి) బ్రిటీష్ డిప్యూటీ హై కమీషనర్(తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) గారెత్ వైన్ ఒవెన్ హైదరాబాద్ లోని తమ సెంటర్ ను సందర్శించారని బ్రటీష్ ఐటీ కంపెనీ కగూల్ తెలిపింది. బ్రిటీష్ హై కమీషన్ ప్రతినిధులైన వరుణ్ మాలి, పీయూప్ అవస్తి లతో కలసి ఒవన్ కగూల్ సెంటర్ కు విచ్చేసారు. బ్రిటీష్ ప్రభుత్వపు అంతర్జాతీయ వాణిజ్యపు శాఖ(డీఐటీ) భారత దేశంలోని బ్రిటిష్ కంపెనీలకు మద్దతుగా చేపడుతున్న చర్యలను కగూల్ యాజమాన్యంతో చర్చించారు. కగూల్ గ్రూప్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ (సీఈఓ) డాన్ బార్లో, ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ) ప్రశాంత్ పటేల్, మేనేజింగ్ డైరెక్టర్ కళ్యాణ్ గుప్త, ఓవెన్ బృందంతో డీఐటీ కార్యకలాపాలను సమీక్షించారు. ఈ సందర్భంగా బ్రిటీష్ హై కమీషన్ అందిస్తున్న విశ్వసనీయ భాగస్వామి పథకపు ప్రయోజనాలను పొందేందుకు కగూల్ హై కమీషన్ తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. డిప్యూటీ కమీషనర్ గారెత్ వైన్ ఒవెన్, కగూల్ ఎండీ కళ్యాణ్ గుప్త అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసారు. ఈ ఒప్పందం ద్వారా యూకే వీసాలు పొందే ప్రక్రియ సజావుగా సాగి తమ సిబ్బందికి సత్వరంగా వీసాలు అందుతాయన్నారు. కార్యకలాపాల విస్తరణకు తోడ్పడే ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం మాకు ఒక ముఖ్యమైన మైలురాయని కళ్యాణ్ గుప్త వివరించారు. భారత దేశంలో విదేశీ పెట్టుబడులలో బ్రిటన్ ఆరో స్థానంలో ఉందన్నారు. ఆరొందలకు పైగా బ్రిటిష్ కంపెనీలు భారత్ లో వాణిజ్య వ్యాపారాలను సాగిస్తూ ఉపాధి అవకాలు, ఆర్థిక వృద్ధికి దోహద పడుతున్నాయన్నారు. ఈ ప్రక్రియలో కగూల్ కూడా ప్రశంసనీయ పాత్ర పోషిస్తోందన్నారు. గత ఐదేళ్ళలో కరూల్ వేగవంతంగా విస్తరిస్తోందన్నారు . కగూల్ హైదరాబాద్ సెంటర్లో 260 మంది సిబ్బంది ఉండగా త్వరలోనే నగరంలోనూ భారత్ లోని ఇతర ప్రాంతాల్లోనూ విస్తరించడానికి సన్నద్ధమవుతోందన్నారు. గూల్ తమ విస్తరణ లక్ష్యాలను అధిగమించి మరిన్ని బ్రిటీష్ కంపెనీలు భారత్ పై దృష్టి కేంద్రీకరించేలా చేస్తుందని విశ్వసిస్తున్నామని గారెత వైన్ ఒవెన్ అన్నారు. కగూల్ అంతర్జాతీయ కార్యకలాపాలకు హైదరాబాద్ సెంటర్ ప్రధాన కేంద్రమని, బ్రిటీష్ హై కమీషన్ తో ఒప్పందం తమ వాణిజ్య విస్తరణకు కీలక ప్రోత్సాహకమని గ్రూప్ సీఈఓ డాన్ బార్లో అన్నారు.
Attachments area
|
బ్రిటీష్ హై కమీషన్ విశ్వసనీయ భాగస్వామిగా కగూల్




