Tuesday, 3 November 2026

బ్రిడ్జ్ ఎత్తుతో పొలాలకు రాకపోకలకు ఇక్కట్లు

బిజినేపల్లి, సెప్టెంబరు 27. జనం సాక్షి : బిజినేపల్లి నుండి హైదారాబాద్కు వెళ్ళే ప్రధాన రహదారిపై 10 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తున్న బ్రిడ్తో చుట్టు పక్కల పొలాలకు రైతులు రాకపోకలు సాగించేందుకు ఇక్కట్లు పడాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం తహసీల్దార్ అంజిరెడ్డికి బ్రిడ్జ్ తగ్గించాలని, అలాగే బ్రిడ్జ్ నిర్మాణం కోసం పలుగు తిప్ప నుండి మొర్రం తీసుకరావడాని నిలిపి వేయాలని రైతులు వినతిపత్రం అందజేశారు. ఒక బ్రిడ్తోనే పొలాలకు వెళ్ళేందుకు బాట లేక ఇబ్బందులు పడుతుండగా దానికి సమీపంలోనే మరో బ్రిడ్జ్ నిర్మించేందుకు అధికారులు పరిశీలించడంతో సమస్య మరింత జకలంగా మారే దుస్థితి ఉందన్నారు. బ్రిడ్జ్ నిర్మాణాల ఎత్తు తగ్గిస్తే ఎక్కడిక్కడ పొలాలకు వెళ్ళేందుకు సులువుగా ఉంటుందని తహసీల్దార్ క్కు వినివించారు. వినతిపత్రం అందజేసిన వారిలో పిట్టల బాల్రాజు, జోజిరెడ్డి, సందీప్రెడ్డి, కత్తె కవిత, రవి తదితరులు ఉన్నారు.
ఫొటో : బిజినేపల్లి తహసీల్దార్ అంజిరెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న రైతులు