*బ్రూక్లిన్ హైస్కూల్ లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఆట పాటలతో అలరించిన ఉపాధ్యాయినిలు విద్యార్థినిలు*,

పాటలతో అలరించిన ఉపాధ్యాయినిలు విద్యార్థినిలు*,
మెట్పల్లి టౌన్ , సెప్టెంబర్ 24 :
జనం సాక్షి
మెట్ పల్లి పట్టణంలోని 12వ వార్డులో గల బ్రూక్లిన్ హైస్కూల్ లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు.పాఠశాలలకు సోమవారం నుంచి దసరా సెలవులు ప్రకటించడంతో పాఠశాల కరస్పాండెంట్ బుర్ర ప్రసాద్ గౌడ్ సతీమణి జయలక్ష్మి మరియు ఉపాధ్యాయినిలు , విద్యార్థినిలు ముందస్తు బతుకమ్మ వేడుకలు సంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. సంప్రదాయ చీరెలు,దుస్తులు ధరించిన ఉపాధ్యాయినిలు, విద్యార్థినులు తీరొక్క పూలతో అతిపెద్ద బతుకమ్మలను పేర్చి ,ఒక్కేసీ పువ్వేసి చందమామ..జాము రాతిరాయే చందమామ.. చిత్తు,చిత్తుల బొమ్మ.. శివుని ముద్దలగుమ్మా అంటూ ఆటపాటలతో కనువిందు చేశారు. పాఠశాల ఆవరణలో పండుగ వాతావరణంలో నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు, ఉపాధ్యాయినిలు బృందంకోలాటాలు, నృత్యాలతో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ బుర్ర ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు, పండుగల విశిష్టత గురించి తెలియజేస్తున్నాము అన్నారు. రకరకాల తీరొక్క పువ్వులతో పేర్చిన అతి పెద్ద బతుకమ్మను పట్టణ శివారులో గల పెద్ద చెరువులో నిమజ్జనం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ బుర్ర ప్రసాద్ గౌడ్, సతీమణి జయలక్ష్మి, ఉపాధ్యాయినిలు, విద్యార్థులు పాల్గొన్నారు