Thursday, 5 November 2026

బ్లాక్ అమ్ముతున్న క్రికెట్ టికెట్లను వెంటనే ఆపేయాలని హెచ్చరించానా క్రికెట్ అభిమానులు .

 

 

సికింద్రాబాద్ (జనం సాక్షి ) : ఈ నెల 25 వ తారీఖున ఇండియా ఆస్ట్రేలియా తో జరిగే క్రికెట్ మ్యాచ్ టికెట్ల కోసం సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ దగ్గర పడిగాపులు కస్తున్న అభిమానులు.. క్రికెట్ అభిమానులతో ఆడుకోవద్దని హెచ్చరించారు. హెచ్ సి ఏ అధ్యక్షులు బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నారని ఆరోపించిన క్రికెట్ అభిమానులు. మూడు రోజుల నుంచి క్రికెట్ టికెట్ల కోసం వచ్చిన అభిమానులకు నిరాశ ఎదురవుతుంది.వీఐపీల కోసమేనా ఈ క్రికెట్ మ్యాచ్ అని అభిమానులు అడుగుతున్నారు.

క్రికెట్ టికెట్లు బ్లాక్ లో అమ్ముతున్న వారిని ఎంతటి వారినైనా ఎదిరిస్తామని క్రికెట్ అభిమానులు హెచ్చరించారు.

ఇప్పటికైనా టికెట్లు ఇవ్వాలని జింఖానా క్రికెట్ గ్రౌండ్ ముందు పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులు వేచి ఉన్నారు .
టికెట్లు ఇస్తారా ఇవ్వరా అని క్రికెట్ అభిమానులు అయోమయంలో ఉన్నారు. బ్లాక్ అమ్ముతున్న క్రికెట్ టికెట్లను వెంటనే ఆపేయాలని హెచ్చరించానా క్రికెట్ అభిమానులు .