భక్తిశ్రద్ధలతో గణనాథుని నిమజ్జనం.

తాండూరు సెప్టెంబర్ 2 (జనం సాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం చెన్ గెస్ పూర్ రోడ్డు మార్గంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో పాఠశాల ప్రిన్సిపల్ పండరి ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాలు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించారు.గత మూడు రోజులుగా విశేష పూజలు అందుకున్న గణనాథుడుని గురుకుల పాఠశాల టీచర్స్ మరియు విద్యార్థులతో కలిసి భక్తిశ్రద్ధలతో గంగమ్మ ఒడ్డుకు చేర్చి వినాయకుని కీ ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జనం చేశారు.అంతకు ముందు బాలికల గురుకుల పాఠశాల ఆవరణలో పాఠశాల టీచర్స్ మరియు విద్యార్థినిలతో కలిసి భజనలు సంకీర్తనలు ఆలపిస్తూ గణపతి బప్పా మోరియా అంటూ భక్తి భావాన్ని చాటుకున్నారు. అనంతరం సమీపంలోని చెరువులో వినాయకుని నిమజ్జనం చేశారు.